డిజిటల్ క్రాప్ సర్వే వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలి
ఆయుధం న్యూస్ వరంగల్ రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను డిజిటల్ క్రాప్ సర్వే యాప్ లో పకడ్బందీగా నమోదు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామ పరిధిలోని చింతకుంట లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే జరుగుతున్న తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.సర్వే నంబర్ల వారీగా వివరాల నమోదు, సాంకేతిక వ్యవస్థ పనితీరు, జియో మ్యాపింగ్, పంటల ఫొటోల నమోదు, తదితర అంశాలను పరిశీలించడంతో...