AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 1:19 pm Posted by : AYUDAM DAILY

కుడా చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి పదవీ బాధ్యతల స్వీకరణ

ఆయుధం న్యూస్ హన్మకొండ:కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా గుండు సుధారాణి శనివారం హన్మకొండలోని KUDA కుడా కార్యాలయంలో అట్టహాసంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అభిమానులు హాజరై గుండు సుధారాణికి పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుడా అధికారులు, సిబ్బంది, వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం గుండు సుదారాణి మాట్లాడుతూ… తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.కుడా పరిధిలో పట్టణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా అధికారులు, సిబ్బంది, వివిధ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు