AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 6:59 am Posted by : AYUDAM DAILY

మట్టి విగ్రహాలను పూజించాలి

తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి, ఆధ్వర్యంలో వినాయక విగ్రహాలు పంపిణి కార్యక్రమం పురస్కరించుకొని కుడా చైర్మన్ గుండు సుధారాణి, గోడ పత్రికలను, మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. ఈసందర్భంగా సుధారాణి  మాట్లాడుతూ ప్రజలందరు మట్టి మరియు సహజ రంగులతో చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే వినియోగించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ , రసాయన రంగులతో చేసిన విగ్రహాలను తయారు చేసే పద్ధతిని నిషేధించి, మట్టి, సహజ రంగులతో చేసిన విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు.కార్యక్రమంలో హనుమకొండ టీజీపీసీబీ నోడల్ అధికారి జీమూత వాహన, ప్లాస్టర్ అఫ్ పారిస్  రసాయన రంగుల తో తయారు చేసిన వినాయక విగ్రహాల ను ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదని వివరించారు పర్యావరణ అనుకూల మట్టి విగ్రహాల ను మాత్రమే ఉపయోగించమని సూచించారు. పర్యావరణ అనుకూలజీవవిచ్ఛిన్నమయ్యే ఉత్పత్తులను ఉపయోగించాలని చెప్పారు. ఏక వినియోగ ప్లాస్టిక్ ఉత్పత్తులను పూర్తిగా విడనాడి పర్యావరణ పరిరక్షణకు అందరు తమ భాద్యతగా భావించాలని కోరారు. ఈకార్యక్రమం లో పాల్గొన్న అధికారులకు సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాల ను పంపిణీ చేయడం జరిగింది.