పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ఆయుధం న్యూస్ హన్మకొండ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాలు మెరుగ్గా ఉండే విధంగా ఉపాధ్యాయులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు.శుక్రవారం హనుమకొండ జిల్లా నడికూడ మండలంలోని రామకృష్ణాపూర్ , కంఠాత్మకూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును పరిశీలించారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు, తాగునీటి సరఫరాను స్వయంగా పరిశీలించారు రామకృష్ణాపూర్ లోని మండల ప్రాథమిక పాఠశాల లలో గల అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి కేంద్రం...