AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 4:02 pm Posted by : AYUDAM DAILY

సూపర్ స్పెషాలిటీ పనులను వేగంగా పూర్తి చేయాలి : ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియాన

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
వరంగల్ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించేందుకు తెలంగాణ వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్‌ క్రిస్టినా జెడ్. చొంగ్తూ సోమవారం గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ న‌గ‌రంకు వి సందర్భంగా వ‌రంగ‌ల్,హ‌న్మ‌కొండ‌ కలెక్టర్లు డాక్టర్ సత్య శారద,చాహత్‌ బాజ్‌పాయ్‌ ఆమెకు పూల మొక్క అందించి స్వాగతం పలికారు.అనంతరం ప్రిన్సిపల్‌ సెక్రటరీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి భవనాన్ని సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సంద‌ర్శ‌న‌లో ఆర్ఎంఓ రామ్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ సుమ తదితరులు ఈ సందర్శనలో ఉన్నారు.