వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి ఆరోగ్యశ్రీ వార్డులో పైకప్పు కూలి రోగులు గాయపడటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ఆయుధం న్యూస్ వరంగల్ ఉత్తర తెలంగాణకే తలమానికమైన, వరంగల్ నగరంలోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఎంజీఎం ఆసుపత్రి కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనం వల్ల వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతోందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆందొళన వ్యక్తం చేశారు.ఆదివారం నాడు ఎంజీఎం ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ వార్డులో అకస్మాత్తుగా ఆస్పత్రి పైకప్పు పెచ్చులు ఊడిపడి, చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులను గాయపడ్డారు.ఈ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించేందుకు సొమవారం నాడు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, బీజేపీ నాయకులు...