AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 3:45 pm Posted by : AYUDAM DAILY

వర్ధన్నపేట పిఏసిఎస్(పాక్స్) చైర్మన్‌గా అబ్బిడి రాజీరెడ్డి డైరెక్టర్స్ ప్రమాణస్వీకారం

ఆయుధం న్యూస్ వ‌ర్థ‌న్న‌పేట‌
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండల కేంద్రంలోని డిసిసిబి బ్యాంకు ఆవరణలో వర్ధన్నపేట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పాక్స్) నూతన చైర్మన్‌గా అబ్బిడి రాజీరెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. వారితో పాటు ఫ్యాక్స్ నూతన డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు.
ఈ కార్యక్రమానికి వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి తోపాటు కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ అబ్బిడి రాజీరెడ్డి మాట్లాడుతూ మండలంలోని రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.రైతులకు సకాలంలో రుణాలు, ఎరువులు, విత్తనాలు అందేలా చూస్తామని, PACS అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని స్పష్టం చేశారు.తమ ఎన్నికకు సహకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజుకి ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు,సహకార సంఘం సభ్యులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.