AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 10:11 pm Posted by : AYUDAM DAILY

జర్నలిస్ట్ వనం భాస్కర్ కు ఘన నివాళి అర్పించిన జర్నలిస్టులు

(ఆయుధం న్యూస్ వరంగల్ ) అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ జర్నలిస్ట్ వనం భాస్కర్ మృతదేహానికి గ్రేటర్  వరంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారం సదయ్య, కోశాధికారి బొల్ల అమర్, పలువురు జర్నలిస్టులు పూలమాలలు  వేసి నివాళులు అర్పించారు.వనం భాస్కర్ కుటుంబానికి ప్రెస్ క్లబ్ నుండి ఇరువై ఐదు వేల రూపాయలు సహయం అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో కూడా ఆ కుటుంబానికి క్లబ్ నుండి ఇరువై వేల ఆర్థిక సాయం అందించడం జరిగింది.భాస్కర్ మృతి దురదృష్టకరమని, వారి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు.
నివాళులర్పించిన వారిలో TUWJ(H)143 వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొరుకొప్పుల నరేందర్, TUWJ-IJU వరంగల్ జిల్లా కార్యదర్శి మట్ట దుర్గాప్రసాద్, ప్రెస్ క్లబ్ ఈసీ సభ్యులు ఎండీ నయీంపాషా, కమటం వేణు గోపాల్, సీనియర్ జర్నలిస్టులు దాసరి శ్రీనివాస్, అడుప మహేష్, జన్ను స్వామి, కందుల శ్రీధర్,పెరుమాండ్ల మధు, బండి రవి, మోహన్, చినబాబు, నీలం శివ, ఉమాశంకర్, పాషా, అక్రం, రాజేశ్, శ్యాం, గంగరాజు, కృష్ణాకర్, సాయి, తదితరులు ఉన్నారు.