ఆయుధం న్యూస్ హన్మకొండ
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131 జయంతి సందర్బంగా న్యూ శాయంపేట లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి , పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ,వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు ,హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు చాహత్ బాజ్ పాయి, సత్య శారద పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రజక సంఘాల నాయకులు, అధికారులు పాల్గోన్నారు.