తెలంగాణలో పూరిగుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం
ఆయుధం న్యూస్ జనగామ పేదవాడి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పేదింటి ఆడబిడ్డ కుటుంబంలో చిరునవ్వు చూడాలన్న తపనతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.శనివారంజనగామ జిల్లాకేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా గల ప్రెస్టన్ కళాశాల గ్రౌండ్ లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, జనగామ మున్సిపల్ ఛైర్పర్సన్ కడకంచి...