AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 06 October 2026, 4:42 pm Posted by : AYUDAM DAILY

మహిళలను, అమ్మాయి లను వేదించే పోకిరిలకు,ఆకాతాయిల‌కు\ కఠినమైన శిక్షలు

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్
నేరాలు, అఘాయిత్యాలు పెరుగుతున్న నేటి కాలంలో నేరాల అదుపులో అందరు భాగస్వామ్యం కావాలని తమవంతు బాధ్యతలను నిర్వర్తించాలని, జాగ్రత్తతో మెలగడం వల్ల మహిళల మీద జరిగే నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చని వరంగల్ క్రైమ్ ఏసీపీ సదయ్య అన్నారు. వరంగల్ లోని చంద్రకాంతయ్య ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో మంగళవారం షీ టీమ్ గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మాయిలు ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచుకోవడంలో జాగ్రత్త వహించాలని, సైబర్ నేరాల పై,అవగహన కలిగివుండాలని. మహిళలు ఒంటరిగా తెలియని ప్రదేశాలకు ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అందరు టీ-సేఫ్ ఆప్ ను ఉపయోగించుకోవాలని, టీ-సేఫ్ ఆప్ పై అవగాహన కలిగి ఉండాలని, ఉద్యోగాలు చేసే మహిళలకు తాము పనిచేసే ప్రదేశాలలో అసభ్యకరంగా ప్రవర్తించే వారి పట్ల, ఆకతాయుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, గుర్తు తెలియని వారితో తమ వ్యక్తిగత విషయాలు పంచుకోరాదని సూచించారు. ఎవరైనా మహిళలపై అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తించినట్టైతే ధైర్యంగా వెంటనే షీ టీమ్ పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే టోల్ ఫ్రీ1930 కి ఫిర్యాదు చేయాలని, మా షీ టీమ్ మొబైల్ నంబర్స్ సీపీ గారి వాట్సాప్ నంబర్ 8712685257, సీఐ వాట్సాప్ నెంబర్ 8712685142, ఎస్ఐ వాట్సాప్ నెంబర్ 8712685270కు ఫిర్యాదు చేసిన వారి వివరాలను చాలా గోప్యంగా ఉంచి నేరస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారిపై చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటామన్నారు. షీ టీమ్ ఇన్స్పెక్టర్ సువర్ణ, ఎస్. ఐ. టీ. యాదగిరి, రామారావు, స్వాతి మరియు కాలేజీ ప్రిన్సిపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.