ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ శివనగర్ ప్రజలపై ఇంత నిర్లక్ష్యమా.. ఆరేళ్లు అయినా మా గోస పట్టదా.. ఇంకెన్నాళ్లు సహించాలి.. అసలు వరంగల్ లో ప్రభుత్వ పాలన ఉందా అంటూ బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివనగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల జాప్యానికి నిరసనగా మంగళవారం శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో శివనగర్‌లో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.డ్రైనేజ్ గుంతలతో అధ్వాన్నంగా మారిన రోడ్డుపై అలుకు నీళ్లు జల్లుతూ, ప్రభుత్వాల మొద్దు నిద్రను నిరసిస్తూ బిజెపి శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న గంట రవికుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే లు.. మంత్రులకు మా గోస పట్టదా.. శివనగర్ అంటే ఎందుకు ఇంత వివక్ష మీకు ఓట్లు..మాకు పాట్లా.. మేము ముంపులోనే ఉండాలా.. వానోస్తే నీటిలో మునగాలా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ఎమ్మెల్యే.. ప్రస్తుత ఎమ్మెల్యే ఇద్దరు.. ఇద్దరే అంటూ ధ్వజమెత్తారు. వారికి ఓట్లు తప్ప మన గోస పట్టదని మండి పడ్డారు. మన సమస్యలపై మనమే యుద్ధం చేయాలని.. ప్రజల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం ముమ్మరం చేస్తుందని… గంట రవికుమార్ స్పష్టం చేశారు.-శివనగర్ డ్రైనేజ్ పనుల ఆలస్యం స్థానిక ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు. దాదాపు రూ. 75 కోట్ల రూపాయల భారీ నిధులు వెచ్చించినప్పటికీ, పనులు నాలుగేళ్లుగా నత్తనడకన సాగడం వెనుక పాలకుల, అధికారుల చేతకానితనమే కారణమని ధ్వజమెత్తారు.నాలుగు నెలల క్రిందట మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అధికారులతో కలిసి ఇదే రోడ్డుపై స్వయంగా సమీక్షసమావేశం ఏర్పాటు చేశారనీ, పది రోజుల్లోనే పనులన్నీ పూర్తి చేసి, ఈ రోడ్డును ప్రజల వాడకానికి ప్రారంభిస్తామని చెప్పి ఏళ్ళు గడుస్తున్నా పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అయినా వారి పార్టీలో.. వారి పదవులకే దిక్కు లేదని.. ఇక మన సమస్యలల్ని ఎక్కడ పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. మాట తప్పడం కొండా దంపతులకు తెలియదని గొప్పలు చెప్పు వారు.. శివనగర్ డ్రెయినేజీ పనుల జాప్యం పై ఇచ్చిన హామీ పై ఇంకెప్పుడు స్పందిస్తారనీ అన్నారు..పనుల్లో సర్కారు కక్షపూరిత వైఖరితో శివనగర్ ప్రజలకు శాపంగా మారిందని గంట ఆరోపించారు. కంపు అనుభవించాల్సి వస్తోందని, నిత్యం డ్రైనేజ్ గుంతలతో ప్రమాదాలు జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యేకు పట్టడం లేదని విమర్శించారు. పదవులు మీవి… కష్టాలు మావా? శివనగర్ డ్రైనేజ్ పనులపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలి అని రవి కుమార్ డిమాండ్ చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హామీలకే పరిమితమయ్యాయని, క్షేత్రస్థాయిలో అభివృద్ధి శూన్యమని మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, గుంతల రోడ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు విలువే లేకుండా పోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని హెచ్చరించారు. శివనగర్ అండర్ డ్రైనేజ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల కష్టాలకు మోక్షం కలిగించకపోతే, బిజెపి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు వైట్ల గణేష్, సూర శ్రీనివాస్, బిజెపి జిల్లా నాయకులు ఆడెపు వెంకటేష్, బైరి శ్యాంసుందర్, మార్తా ఉషారాణి, తాళ్లపల్లి శ్రీనివాస్, బండి సుజాత, శెట్టి స్రవంతి, పిట్టల వెంకన్న, జన్ను ప్రభాకర్, నవీన్, దేవక్క, డివిజన్ కన్వీనర్లు సతీష్, బొడకుంట్ల శివశంకర్, తోట సాగరిక, శెట్టి రమేష్, సూరజ్, బిజెపి జిల్లా పదాధికారులు బన్న ప్రభాకర్, గడల కుమార్, బైరి నాగరాజు, అంకాల జనార్ధన్, వివిధ జిల్లా మోర్చా అధ్యక్షులు మాదాసు రాజు, కూచన క్రాంతి కుమార్ , కర్నె రవీందర్, షేర్ల అనిల్, మోహనాచారి, వీరస్వామి, సాయి, చంద్రమోహన్, సతీష్ కట్టర్, కందుకూరి శ్రీనివాస్, జెట్లింగ్ శివప్రసాద్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.