డ్రైనేజ్ పనులు పూర్తి చేయకుంటే మున్సిపాలిటీ కార్యాలయం, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడి చేస్తాం
ఆయుధం న్యూస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ శివనగర్ ప్రజలపై ఇంత నిర్లక్ష్యమా.. ఆరేళ్లు అయినా మా గోస పట్టదా.. ఇంకెన్నాళ్లు సహించాలి.. అసలు వరంగల్ లో ప్రభుత్వ పాలన ఉందా అంటూ బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివనగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనుల్లో ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల జాప్యానికి నిరసనగా మంగళవారం శివనగర్ మండల అధ్యక్షులు మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో శివనగర్‌లో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.డ్రైనేజ్ గుంతలతో అధ్వాన్నంగా మారిన రోడ్డుపై అలుకు నీళ్లు...