ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు నాణ్యమైన వైద్య సేవలను అందించాలి
ఆయుధం న్యూస్ హన్మకొండ హనుమకొండ లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి (గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ) లోని వివిధ విభాగాల్లో మంగళవారం విస్తృత తనిఖీలు చేసి గర్భిణీలు, బాలింతలు, మహిళలకు అందిస్తున్న వైద్య సేవలు, ఆసుపత్రిలోని వసతులను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పరిశీలించారు. వైద్య సేవల నిమిత్తం అక్కడికి వచ్చిన గర్భిణీ, బాలింతలతో కలెక్టర్ మాట్లాడి అందుతున్న వైద్య సేవలపైన అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని ఓపీ సేవలు, ఆరోగ్య మహిళా క్లినిక్, ఫెర్టిలిటీ క్లినిక్, ల్యాబొరేటరీ,...