సంప్రదాయాల సౌరభం.. సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు
ఆయుధం న్యూస్ గ్రేటర్ వరంగల్ :తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు, ఆడపడుచులు ఆనందోత్సాహాలతో జరుపుకునేలా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోందని. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న తెలిపారు. శుక్రవారం కమిషనర్ హన్మకొండ నగర పరిధిలోని హసన్‌పర్తి చెరువు, భీమారం చెరువు తదితర ప్రాంతాలను సందర్శించి బతుకమ్మ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో...