భద్రకాళి చెరువు అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలి
ఆయుధం న్యూస్ హన్మకొండ భద్రకాళి చెరువు వరద నీటి అవుట్ ఫాల్ రెగ్యులేటర్ పనులను వేగవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.మంగళవారం హనుమకొండలోని కాపువాడలో భద్రకాళి చెరువు కట్ట వద్ద చేపట్టిన నాలా విస్తరణ పనులను, భూ సేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగిలి ఉన్న భూ సేకరణ ప్రక్రియను, నాలా విస్తరణ అభివృద్ధి పనుల పురోగతిని అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ నాలా...