భద్రకాళీ అమ్మవారు భవానీ మాత గా అలంకరణ
ఆయుధం న్యూస్ వరంగల్ వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో దేవీశరన్నవరాత్రులు అరవ రోజుకు చేరుకున్నాయి. ఉదయం నిత్యాహ్నికం నిర్వర్తించి అమ్మవారిని భవానీ మాత గా అలంకరించి పూజానాధలు నిర్వహించారు. ఎక్కడైతే భోగముందో అక్కడ మోక్షముండదు. ఎక్కడైతే మోక్షముంటుందో అక్కడ భోగముండదు. కానీ అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు కలుగుతాయని శాస్త్రం చెబుతున్నందున అమ్మవారిని భవానిగా అలంకరించడం జరిగినది. ఎందుకంటే అమ్మవారు శంకరుడికి భవాని రూపంలో సమస్త భోగాలనిస్తుందని శాస్త్రం చెబుతోంది. భవాని మాతగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకోవడం వలన...