టిటిడి ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ప‌ది లక్షల విరాళం

తమిళనాడులోని తంజావూరుకు చెందిన జెఎస్వీ ఇన్ఫ్రా' మేనేజింగ్ పార్టనర్ వైద్యలింగం, తిరుమ‌ల తిరుప‌తి ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు ప‌ది లక్షల రూపాయాల‌ విరాళాన్ని డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో అందజేశారు.గోసంరక్షణ కోసం భక్తులు దాతలు అందించే సహకారం ఎంతో విలువైనదని. ఈ పవిత్ర కార్యంలో భాగస్వాములవుతున్న ప్రతి దాతకు టిటిడి చైర్మ‌న్ బిఆర్ నాయుడు కృత‌జ్ఞాత‌లు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి నరేష్ కుమార్ పాల్గొన్నారు.