మేకల రవి మృతి సిపిఐకి తీరని లోటు : కూనంనేని సాంబశివరావు

ఆయుధం న్యూస్ వరంగల్ : సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవికి ప్ర‌జ‌లు శనివారం వరంగల్ నగరంలో కన్నీటి వీడ్కోలు పలికారు. శుక్రవారం మేకల రవి అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతి చెందగా శనివారం వరంగల్ లో అశృనయనాల మద్య అంత్యక్రియలు నిర్వహించారు. వరంగల్ నగరంలోని శివ నగర్ లో గల మేకల రవి స్వగృహం వద్ద ఆయన భౌతిక కాయాన్ని ఉంచగా వందలాది మంది ప్రజలు, సిపిఐ కార్యకర్తలు తరలి వచ్చి నివాళులు అర్పించారు.అంత్యక్రియల సందర్భంగా దారి పొడవునా మేకల...