AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 8:05 am Posted by : AYUDAM DAILY

ఆయుష్ శాఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో 12 పోస్టులకు 494 దరఖాస్తులు

ఆయుధం న్యూస్ వరంగల్
ఆయుష్ శాఖ ఔట్సోర్సింగ్ పద్ధతిలో 12 పోస్టులకు నిరుద్యోగ అభ్యర్థులు 494 మంది దరఖాస్తులు చేసుకున్నారని వరంగల్ జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ మైదం రాజు తెలిపారు. నేషనల్  ఆయుష్ మిషన్ లో  భాగంగా ఆయుష్ శాఖలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ సేవల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించగా   ఆయుష్ పీజీ డాక్టర్ కోసం ఒక పోస్టు, నాలుగు ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు డైటీషన్ ఒక పోస్ట్ కు,సైకో సోషల్ కౌన్సిలర్  ఒక పోస్ట్ 1 కోసం, యోగ ప్రొఫెషనల్ ఒక పోస్ట్ కోసం1మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ నాలుగు పోస్టుల కోసం  మొత్తం 12 పోస్టులకు 494 దరఖాస్తులు అక్టోబర్ 31 శనివార వరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు వచ్చాయని వరంగల్  జిల్లా ఆయుష్ విభాగంనోడల్ అధికారి డాక్టర్ మైదం రాజు శనివారం ఒకప్రకటనలో తెలిపారు.ఉద్యోగ నియామకాలకు ఈ అభ్యర్థుల ఎంపిక వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద  “ప్రాంతీయ  సంచాలకులు డాక్టర్ బి ప్రమీలదేవి  పర్యవేక్షణలో  ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుందని ఆయన తెలిపారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్,  ఫార్మసిస్టు ఓదెలు, శ్యామ్,  రాజమణి, శ్రీలక్ష్మి, నరసయ్య దరఖాస్తుల స్వీకరణకు కార్యక్రమంలో పాల్గొన్నారు