యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండగా ఉంటుంది.

ఆయుధం న్యూస్ ములుగు యువత లక్ష్య సాధనకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, పట్టుదలతో చదివి పోలీస్ ఉద్యోగాలు సాధించాలని అభ్యర్థులకు సూచించారు.బుధవారం ములుగు ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను మంత్రి పరిశీలించారు. శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో నేరుగా మాట్లాడి, వారి...