బాలికలతో కలిసి నృత్యం చేసిన హనుమకొండ కలెక్టర్
ఆయుధం న్యూస్ హన్మకొండ హనుమకొండ సుబేదారిలోని అసుంత నిలయం చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ప్రాంగణంలో జిల్లా మహిళలు, దివ్యాంగులు వయో వృద్ధుల శాఖ జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం. విశ్వజ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడుతూ.. బాలల దినోత్సవ వేడుకల్లో బాలలకు సంబంధించి సున్నితమైన అంశాలను చక్కటి సందేశం తో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక అంశాలపై అవగాహన...