వర్ధన్నపేట నియోజకవర్గంలో 2,161 మందికి చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ సమాజంలోని పేదలు, నిరుపేదలు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారికి ఆర్థిక భరోసా కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం హనుమకొండలోని అంబేద్కర్ భవన్‌లో గ్రేటర్ వరంగల్ పరిధిలోని వర్ధన్నపేట నియోజకవర్గ లబ్ధిదారుల కోసం ఏర్పాటు చేసిన చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఆర్...