AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 18 November 2026, 7:14 pm Posted by : AYUDAM DAILY

భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూముల రీ సర్వే

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూముల రీ సర్వే ప్రక్రియను చేపట్టినట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో భూముల రీ సర్వే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ భూముల రీ సర్వే చేయడం ద్వారా పట్టాదారు, భూ విస్తీర్ణం, తదితర అన్ని వివరాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. భూ రీ సర్వే ప్రక్రియలో స్థానిక రైతుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామంలో చేపట్టే భూముల రీ సర్వే ప్రక్రియలో రైతులు, స్థానికులు సర్వే బృందాలకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ముప్పు శైలజ, నాయబ్ తహసిల్దార్ రమేష్, డీఐ సారంగపాణి, సర్వేయర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ భరత్ చంద్ర, జీపీవో సందీప్, ఉపసర్పంచ్ అశోక్, సర్వేయర్లు, ఇతర అధికారులు, రైతులు, స్థానికులు పాల్గొన్నారు.