భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూముల రీ సర్వే
ఆయుధం న్యూస్ హన్మకొండ భూ సమస్యల శాశ్వత పరిష్కారానికే భూముల రీ సర్వే ప్రక్రియను చేపట్టినట్లు హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అన్నారు.బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలో భూముల రీ సర్వే అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రవి మాట్లాడుతూ భూముల రీ సర్వే చేయడం ద్వారా పట్టాదారు, భూ విస్తీర్ణం, తదితర అన్ని వివరాలు పారదర్శకంగా ఉంటాయన్నారు. భూ రీ సర్వే ప్రక్రియలో స్థానిక రైతుల సహకారం ఎంతో ముఖ్యమన్నారు....