AYUDAM DAILY
Newspaper Banner
Date of Publish : 19 November 2026, 5:44 pm Posted by : AYUDAM DAILY

సీనియర్ జర్నలిస్టు తోట సుధాకర్ కు ఉత్తమ ప్రతిభా పురస్కారం

ఆయుధం న్యూస్ హైద‌రాబాద్ : హనుమకొండకు చెందిన సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి తోట సుధాకర్ కు మరోసారి ఉత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ప్రజాపక్షం దినపత్రిక ఎనిమిద‌వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని బండ్లగూడలో గల ప్రజాపక్షం పత్రిక కార్యాలయంలో జరిగిన వార్షికోత్సవ సభలో జర్నలిస్టుగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను నగదు రివార్డుతో పాటు మెమెంటో, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి తోట సుధాకర్ ను సన్మానించి అభినందనలు తెలిపారు. నవచేతన విజ్ఞాన సమితి చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజాపక్షం సంపాదకులు మక్కెన సుబ్బారావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, నవచేతన విజ్ఞాన సమితి కార్యదర్శి బిఎస్ఆర్ మోహన్ రెడ్డి, కోశాధికారి ఉజ్జిని రత్నాకర్ రావు, నవచేతన గవర్నింగ్ బాడీ సభ్యులు కలవేన శంకర్,బొమ్మగాని ప్రభాకర్, నేదునూరి జ్యోతి, విఎస్ బోస్, ప్రజాపక్షం జనరల్ మేనేజర్ (యాడ్స్) వి. మదన్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ బి. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.