సీనియర్ జర్నలిస్టు తోట సుధాకర్ కు ఉత్తమ ప్రతిభా పురస్కారం
ఆయుధం న్యూస్ హైదరాబాద్ : హనుమకొండకు చెందిన సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి తోట సుధాకర్ కు మరోసారి ఉత్తమ ప్రతిభా పురస్కారం లభించింది. ప్రజాపక్షం దినపత్రిక ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లోని బండ్లగూడలో గల ప్రజాపక్షం పత్రిక కార్యాలయంలో జరిగిన వార్షికోత్సవ సభలో జర్నలిస్టుగా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు గాను నగదు రివార్డుతో పాటు మెమెంటో, శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాసరెడ్డి తోట...