ఖేలో ఇండియా క్రీడలకు హనుమకొండ ముస్తాబు

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ జాతీయస్థాయి ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని సరికొత్త హంగులతో తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. స్టేడియం గ్యాలరీలకు ఆకర్షణీయమైన రంగులు వేయడంతో పాటు ఖేలో ఇండియా లోగోను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి స్టేడియానికి క్రీడా శోభ తీసుకురావాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ జేఎన్ఎస్ స్టేడియాన్ని సందర్శించి జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్యాలరీలకు రంగులు వేయడం, స్టేడియం సుందరీకరణ, ఖేలో...