భవనాల్లో అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు తప్పనిసరి నిబంధనలు పాటించని వారిపై చర్యలు: కమిషనర్ టీ. వెంకన్న

ఆయుధం న్యూస్ వ‌రంగ‌ల్ గ్రేట‌ర్ వ‌రంగ‌ల్ నగరంలోని పెద్ద భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణకు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా పటిష్టమైన అగ్నిమాపక భద్రతా ఏర్పాట్లు కల్పించాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టీ. వెంకన్న సూచించారు.శుక్రవారం నగరంలోని హనుమకొండ లోని డీమార్ట్, వరంగల్ లోని బిల్లా ఓపెన్ మైండ్ పాఠశాల, బాలసముద్రంలోని కళ్యాణి ఆసుపత్రి, నక్కలగుట్టలోని అసుక భవన్ తదితర భవనాలను కమిషనర్ సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన అగ్నిమాపక భద్రతా పరికరాలు, అత్యవసర రక్షణ ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో...