వరంగల్‌ను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం

ఆయుధం న్యూస్ హ‌న్మ‌కొండ‌ వరంగల్ నగరాన్ని రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా విద్యా, వైద్య రంగాల్లో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందిన వరంగల్‌ను క్రీడా రంగంలోనూ దేశస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 అధికారిక మస్కట్ 'నీలమణి' పోస్టర్‌ను స‌మావేశ‌ మందిరంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్...