కార్తీక మాస వనభోజనాల గోడ పోస్టర్ ఆవిష్కరణ
ఆయుధం న్యూస్ హన్మకొండ: హన్మకొండ జిల్లా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 29న నిర్వహించనున్న కార్తీక మాస సామూహిక వనభోజనాల కార్యక్రమ గోడ పోస్టర్ను ఆ సంఘం ముఖ్య అతిథులు లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, సామూహిక వనభోజనాలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమమే కాకుండా, కుల బాంధవులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఆత్మీయ సమ్మేళనమని పేర్కొన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో దూరమవుతున్న మానవ సంబంధాలను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా నేటి యువత, పిల్లలకు మన సంప్రదాయాలు, ఐక్యత విలువలను...