25న మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉద్యోగ అర్హత పరీక్ష

ఆయుధం న్యూస్ వరంగల్ నేషనల్ఆయుష్ ప్రోగ్రాం కింద అవుట్  ఔట్సోర్సింగ్ పద్ధతిలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ ఉద్యోగ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న వరంగల్ జిల్లా అభ్యర్థులకు ఈనెల 25 ఉదయం 10 గంటలకు ఏవివి జూనియర్ కళాశాల వరంగల్ నందు లిఖితపూర్వక పరీక్ష నిర్వహించడం జరుగుతుందని వరంగల్ జిల్లా ఆయుష్ విభాగం నోడల్ అధికారి మైదం రాజు తెలిపారు అభ్యర్థులు పొందిన రసీదు, ఆధార్ కార్డు తీసుకొని ఒక గంట ముందు ఎగ్జామ్ హాల్ కు రాగలని సూచించారు