Friday, November 8, 2024

E-Paper

Homeజాతీయం25 నుండి మే8వరకు ఓటరు సమాచార స్లిప్పులు

25 నుండి మే8వరకు ఓటరు సమాచార స్లిప్పులు

ఆయుధం హన్మకొండ
హన్మకొండ జిల్లా పరిధిలోని ఓటర్లకు ఓటరు సమాచార స్లిప్పులు పంపిణీని ఈ నెల 25 నుండి మే 8వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందిన హనుమకొండ రెవెన్యూ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పోలింగ్ కేంద్రాలలో జరిగిన మార్పుల వివరాల జాబితాను గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వాటి ప్రతులను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఓటరు సమాచార స్లిప్పు ప్రతి ఓటరు కు చేరే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను ఓటర్లకు బీఎల్వోల ద్వారా అందేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఓటరు సమాచార స్లిప్పులను అందించే ప్రక్రియ పై ఆర్డీవోలు స్థానిక తహసీల్దార్ల ద్వారా శిక్షణ అందించాలన్నారు. అదేవిధంగా మారిన పోలింగ్ కేంద్రాల వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులు సంబంధిత పోలింగ్ కేంద్రాల పరిధిలోని ఓటర్లకు తెలియజేయాలని కోరారు. పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరంగల్ పశ్చిమ, పరకాల ఆర్డివో కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలన్నారు. వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాల పరిధిలోని అన్నీ పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ, పరకాల ఆర్డివోలు వెంకటేష్, నారాయణ, పౌర సరఫరాల శాఖ విజిలెన్స్ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉమారాణి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, నాయబ్ తహసిల్దార్ రామకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి. శ్రీనివాస్ రావు, రావు అమరేందర్ రెడ్డి, శ్యాంసుందర్, మణి, ఎండి నేహాల్, రజినీకాంత్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Most Popular