హరియాణాలో కమలం పార్టీ విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారాన్ని దక్కించుకుంది. మొదట కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలోకి వచ్చినా తర్వాత వెనబడింది. మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు గానూ బీజేపీ ఇప్పటికే 49 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ 35 స్థానాల్లో విజయం సాధించింది. ఐఎన్ఎల్డీ రెండు స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఖాతానే తెరవలేదు. గత పార్టమెంట్ ఎన్నికల్లో బిజెకి తక్కువ సీట్లు వచ్చిన ఈ సారీ బిజెపి పార్టీ అధిష్టాణం ప్రణాళిక బద్దంగా అభ్యర్ధుల ఎంపిక ప్రచారం చేయడంతో ఎన్నికల్లొ ఓటర్లు అకర్షించి మరోసారి బిజెపికి ఓటర్లు అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా నాయభ్ సింగ్ మరోసారి అయ్యె అవకాశాలు ఉన్నాయి