Friday, November 29, 2024

E-Paper

Homeక్రైమ్అధికారులపై దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

అధికారులపై దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

రాష్టంలో సంచలనం సృష్టించిన అధికారులపై దాడులకు దిగిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకొంటున్నారు.వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం నాడు జరుపతల పెట్టిన గ్రామ సభలో ఉద్రిక్తత వాతావారణలో జిల్టా అధికారులపై జరిగిన దాడి కేసు లో పోలీసులు దాడి చేసిన వారిని పట్టుకునే పనిలో పడ్డారు. గ్రామంలో విడియో పుటేజీ స్థానిక అధికారులతో కలసి దాడిచేసిన వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటివరకు యాబై మంది దాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుసమాచారం. రాష్టముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకర్గంలో అధికారులపై రైతులు దాడి చేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దుద్యాల మండలంలో పలు గ్రామాలలో పోలీసు అధికారులు ఇంటర్ నెట్ సేవలు నిలిపివేసి సంఘటనలో పాల్గొన్న వ్యక్తులపై సొమవారం రాత్రినుండి అధికారులు విచారణ ప్రారంభించారు. దాడిలో పాల్గోన్న వారు ఎవరు ఎపార్టీ సంబందించిన వారు రైతులను అధికారులపై దాడులు చేయమని ప్రొత్సహించింది ఎవరు అన్న కొణంలో అదికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడులకు దిగినవారు బిఆర్ఎస్ కార్యకర్తలేనని వారి ఫోటోలు సోషల్ మీడియాలలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి పోలీసులు మాత్రం దాడిలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గోన్నవారి వివరాలు సేకరిస్తునే సంఘటనలో సంబంధం ఉన్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు.

Most Popular