Thursday, April 3, 2025

E-Paper

Homeతెలంగాణభద్రకాళీ అమ్మవారికి గులాబిరంగు గన్నేరు పూలతో అర్చన

భద్రకాళీ అమ్మవారికి గులాబిరంగు గన్నేరు పూలతో అర్చన

వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలో వసంత నవరాత్ర మహెూత్సవములు మూడవ రోజుకు చేరుకున్నాయి. మూడవ రోజు కార్యక్రమాలలో  మంగళవారం ఉదయం సుప్రభాత సేవ, నిత్యాహ్నికం జరుపడిన పిమ్మట కల్పోక్త ప్రకారం వసంత నవరాత్ర ఉత్సవాల సందర్భంగా జరుపవలసిన విశేష జపహెూమార్చనాభిషేకములు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి లక్ష కరవీర (గులాబిరంగు గన్నేరు) పూలతో అర్చన జరిపి అమ్మవారికి నివేదనలు సమర్పించి భక్తులకు ప్రసాద వితరణ చేశామని భద్రకాళీ దేవస్థానం కార్యనిర్వహణాధికారి సహాయ కమీషనర్ కె. శేషుభారతి తెలిపారు

 

Most Popular