Thursday, May 22, 2025

E-Paper

Homeజాతీయంపోలీసుల నిఘా నీడలో నీట్ ప్రవేశ పరీక్ష

పోలీసుల నిఘా నీడలో నీట్ ప్రవేశ పరీక్ష

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం జరగనున్న నీట్ (యూ.జి) పరీక్ష సజావుగా నిర్వహించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు అభ్యర్థులను కేంద్రంలోనికి ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 01:30 గంటల వరకు మాత్రమే అనుమతించాలని.అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని.పరీక్ష కేంద్రాల వద్ద 163 బి.యన్.యస్.యస్, /(144) సెక్షన్ అమలులో ఉంటుందని, సెంటర్ల వద్ద గుంపులు, గుంపులుగా తిరగడానికి వీలులేదని, 100 మీటర్స్ వపల ఉన్న అన్నీ జిరాక్స్ షాప్ మూసివేయాలన్నారు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్స్ ఎవ్వరూ ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోనికి తీసుకొని వెళ్లరాదన్నారు. అన్నీ పరీక్ష కేంద్రాలు సిసి కెమెరాల పర్యాయవేక్షణలో ఉంటాయన్నారు. సంబంధిత పోలీస్ అధికారులు ప్రతి ఒక్క అభ్యర్ధిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం పరీక్ష కేంద్రంలోనికి అనుమతించాలని, పరీక్షా సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తూ.. పటిష్ట బందోబస్తు నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు. అలాగే పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులకు సీపీ సూచనలు చేస్తూ అభ్యర్థులు అడ్మిట్ కార్డు తో పాటు గుర్తింపు కార్డు, 2- పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, 1- పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకొని రావాలని అన్నారు.
అభ్యర్థులు, ఇన్విజిలేటర్లల యొక్క ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించేది లేదని, అలాగేషూస్, సాక్స్, బెల్ట్, బంగారు,వెండి, ఇతర ఆభరణాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవని, ఇవి లేకుండా అభ్యర్థులు పరీక్షకు రావాలని. ఫుల్ షర్ట్స్ కి అనుమతి లేదని, హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మాత్రమే వేసుకోవాలి. ట్రాన్స్పరెంట్/ పారదర్శకంగా ఉండే వాటర్ బాటిల్స్ కు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అడ్మిట్ కార్డ్ నందున్న సూచనలు పాటిస్తూ.. పరీక్ష కేంద్రాలకు సకాలంలో హాజరు కావాలని పోలీస్ కమిషనర్ అభ్యర్థులు సూచనలు చేశారు.ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు రవి, సురేష్ కుమార్ తో పాటు ఐటీ కోర్, కమ్యూనికేషన్ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Most Popular