Thursday, May 22, 2025

E-Paper

Homeతెలంగాణఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పురోగతి, 5% రిబెట్ (ఎర్లీ బర్డ్ ఆఫర్) ఏడవ తేదీ...

ఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పురోగతి, 5% రిబెట్ (ఎర్లీ బర్డ్ ఆఫర్) ఏడవ తేదీ వరకు గడువు పొడిగింపు

గ్రేటర్ వరంగల్ నగరంలోఎర్లీ బర్డ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈనెల ఏడవ తేదీ వరకు గడువు పొడిగించినందున ప్రాపర్టీదారులు సద్వినియోగం చేసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి తెలిపారు.బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ కాన్ఫరెన్స్ హాల్ లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడేతో కలసిఎల్ ఆర్ ఎస్ దరఖాస్తుల పురోగతి, 5% రిబెట్ (ఎర్లీ బర్డ్ ఆఫర్) వసూళ్ల, హీట్ వేవ్ పై సమీక్షించి సమర్ధ నిర్వహణకు అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎర్లీ బర్డ్ ద్వారా ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేట్ పొందవచ్చు అని, ఇప్పటివరకు బల్దియా వ్యాప్తంగా 25 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను వసూలు అయిందన్నారు. ఇంక మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున నగర ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5 శాతం రిబేట్ పొందాలని కోరారు. ఎల్ఆర్ఎస్ పై సమీక్షిస్తూ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రుసుము చెల్లించు గడువు నేటితో ముగుస్తుందని, ఇప్పటివరకు 30,500 మంది ప్లాట్ల క్రమబద్ధీకరణకు 170 కోట్ల రూపాయల ఫీజు చెల్లించారని తెలిపారు. అధికారులు ఫీజులు చెల్లించిన వారికి త్వరితంగా క్రమబద్ధీకరణప్రొసీడింగ్లు జారీ చేయాలన్నారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శుక్రవారం హైదరాబాద్లో హీట్ వేవ్ పై తీసుకోవాల్సిన చర్యలపై ఏక్షన్ ప్లాన్ విడుదల చేసి ఆదేశించిన విధంగా చర్యలు తీసుకోవాలని మేయర్ అన్నారు.వేసవిలో పెరుగుతున్నఎండలు, వడగాలుల నుంచి ప్రజలు రక్షించుకునేందుకు వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించాలని మేయర్ అధికారులను కోరారు. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్పుల దృష్ట్యా ఇప్పటికే నగరవ్యాప్తంగా చలివేంద్రాలు, ముఖ్య కూడళ్ల వద్ద గ్రీన్ షేడ్లు బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీనికి తోడుగా కుక్కలకు, పక్షులకు నీతి తొట్టెలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అధిక ఉష్ణోగ్రత వల్ల ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అందుకుగాను కమర్షియల్ కాంప్లెక్స్ సెల్లార్లలో నిర్మాణాలు లేకుండా చూడాలని, షార్ట్ సర్క్యూట్ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని ఎలా నగర ప్రజల్లో అవగాహన కల్పించాలని టపాకాయలు తయారు కేంద్రాల వద్ద, ఎక్కువ గన్నీ బ్యాగులు ఉన్నచోట్ల, ప్లాస్టిక్ సామాగ్రి అధికంగా ఉన్న ప్రాంతాల్లో నిర్వాహకులకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి రెడ్ మార్క్ స్టిక్కర్ వేసి వర్షాకాలానికి ముందే ఆయా శిథిల గృహాలను తొలగించేలా ప్రణాళిక బద్దంగా సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని డిఎఫ్ ఓ ను ఆదేశించారు.జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాఖేడే మాట్లాడుతూ సమన్వయంతో ఎండలు, వడగాలుల నుంచి ప్రజలు రక్షించుకునేందుకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎర్లీ బర్ద్ ద్వారా పన్ను పై 5 శాతం రిబెట్ అవకాశం ఈ నెల 7వ తేదీతో ముగిస్తున్నందున ఆస్తి పన్ను చెల్లింపుదారులు చెల్లించేలా ప్రోత్సహించాలని అన్నారు.ఈ సమీక్షలో అదనపు కమిషనర్ జొనా, ఉప కమిషనర్లు ప్రసన్న రాణి రవీందర్, డీఎఫ్ఓ శంకర్ లింగం టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Most Popular