Saturday, November 30, 2024

E-Paper

Homeలేటెస్ట్సమాజానికి హాని చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయండి -వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి....

సమాజానికి హాని చేసే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయండి -వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్

చట్ట వ్యతిరేక కార్యకలపాలతో పాటు సమాజానికి హాని కలిగించే వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్స్ట్ పరిధిలో పీడీ యాక్ట్ అమలుతీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసారు. స్పెషల్ బ్రాంచ్, సిసిఎస్, టాస్క్ ఫోర్స్, సిసిఆర్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో ముందుగా వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు నమోదు చేసిన పీడీ వివరాలతో పాటు, ప్రస్తుతం పీడీ యాక్ట్ క్రింద జైలుకు వెళ్ళి వచ్చిన వ్యక్తుల ప్రస్తుత స్థితిగతులతో పాటు, పోలీస్ స్టేషన్ల వారిగా పీడీ యాక్ట్ నమోదు చేయాల్సిన నిందితుల వివరాలపై పోలీస్ కమిషనర్ అధికారులతో సమీక్ష జరిపారు. ముఖ్యం గా భూకజ్జాలు, గంజాయి విక్రయదారులు, వైట్కాలర్ నేరగాళ్ళు, ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంతో పాటు ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లలకు సంబంధించి గతంతో పాటు ప్రస్తుత నేర చరిత్రపై పూర్తి సమాచారాన్ని సేకరించాలని, అలాగే పోలీస్ స్టేషన్ల వారిగా ఇలాంటి నేరగాళ్ళ సమాచారాన్ని సేకరించి పీడీయాక్ట్ నమోదుకు వున్న సాధ్యాసాధ్యాలను సంబంధిత అధికారులతో చర్చించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ సమావేశంలో క్రైమ్స్ డిసిపి మురళీధర్, ఎసిపిలు రమేష్ కుమార్, మధుసూధన్, మల్లయ్యతో పాటు ఇన్స్పెక్టర్లు,ఎస్.ఐలు, పీడీయాక్ట్ సెల్ అధికారులు పాల్గోన్నారు.

Most Popular