Saturday, November 30, 2024

E-Paper

Homeజాతీయంరాముడు అందరి వాడు..ప్రతిపక్షాల ఆరోపణ సిగ్గు చేటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

రాముడు అందరి వాడు..ప్రతిపక్షాల ఆరోపణ సిగ్గు చేటు కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి

వరంగల్ ఆయుధం
రాముడిపై బీజేపీ రాజకీయాలు చేస్తుందనేది అవగాహన లేని వాళ్లు చేస్తున్న ఆరోపణలని, అయోధ్య రామాలయం దేశ ప్రజలందరికీ చెందుతుందని, రాముడంటే సత్యానికి, ధర్మానికి, విశ్వాసానికి నిదర్శనమని, రాజకీయాలకతీతంగా ప్రజలంతా దర్శనం చేసుకుంటున్నారని అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. దేశాయిపేట్ రోడ్డులోని కేఆర్ గార్డెన్ ఎదురుగా ఉన్న బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ఆధ్వర్యంలో మంగళవారం అయోధ్య శ్రీ బాల రామ్ మందిర్ దర్శన్ అభియాన్ పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటరమణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిపక్షాలు రాముడిపై రాజకీయాలు చేస్తున్నాయని, బీజేపీ ఎప్పుడు ప్రజల మనసెరిగి పని చేస్తుందని చెప్పారు. హిందుత్వాన్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే కాంగ్రెస్‌ నైజమని ఆరోపించారు. ప్రజలంతా రాముడి దర్శనం చేసుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 ఎంపీ సీట్లు కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. మోడీ దేశ రక్షణ కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అలాగే మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సంక్షేమం ప్రతీ ఇంటికి చేరుతున్నాయని చెప్పారు. మోడీ అందిస్తున్న పాలనకు తెలంగాణ ప్రజలు సైతం ఆకర్షితులవుతున్నారని, దీనికి నిదర్శనం అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. మొదటిసారి వరంగల్ జిల్లాకు వచ్చిన అయోధ్య బాల రాముడి దర్శన్ అభియాన్ రాష్ట్ర కో ఆర్డినేటర్, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, ప్రధాన కార్యదర్శి బాకం హరి శంకర్, వన్నాల వెంకటరమణ, గడల కుమార్ యాదవ్, పొట్టి శ్రీనివాస్ గుప్తా, బండి సాంబయ్య యాదవ్, మల్లాడి తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ పదాధికారులు పాల్గొన్నారు.

 

Most Popular