Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణపదవుల కోసం కాదు.. పరకాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను పరకాల మాజీ ఎమ్మెల్యే...

పదవుల కోసం కాదు.. పరకాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి.

అయుధం పరకాల
పదవుల కోసం కాదు, పరకాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి అన్నారు. సోమవారం పరకాల పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పుష్పగుచ్చం, శాలువాతో సన్మానించి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి మాట్లాడుతూ పరకాల అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని తన పదవుల కోసం పార్టీలో చేరలేదని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఉద్యమకారులకు న్యాయం చేస్తున్నాడు అందుకోసమే నాతోపాటు ఉన్న తెలంగాణ ఉద్యమకారులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని వారందరితో చర్చించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన దిశగా అడుగులు వేస్తున్నారని ఎన్నో సంక్షేమ పథకాలను వచ్చిన కొన్ని రోజుల్లోనే ప్రజలందరికీ అందించారని ఆయన ప్రజా పాలన లో భాగం అయ్యేందుకు ఆయనతోపాటు పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి నర్సంపేటను ఎన్నో రకాల అభివృద్ధి పరచారని పరకాలను కూడా అభివృద్ధి పరుస్తారని వారితో కలిసి పని చేసేందుకు పార్టీలో చేరానని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గ ఆస్తులను కొల్లగొట్టాడని అతనిని ఓడించడమే లక్ష్యంగా బిజెపి పార్టీలో పనిచేశానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గతం నుండి పనిచేసిన నాయకులకు గుర్తింపు ఉంటుందని, పాత నాయకులు నావల్ల ఏమాత్రం బాధపడకుండా చూసుకుంటానని అన్నారు. రాబోయే పరకాల మున్సిపల్ ఎన్నికల్లో 22 సీట్లకు 22 గెలిచే విధంగా కృషి చేస్తానని ,ఎంపీ ఎన్నికలలో ఎవరిని నిలపెట్టిన గెలిపించుకుంటానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పరకాల కౌన్సిలర్ పంచగిరి జయమ్మ తో పాటు మాజీ ఎంపీపీలు ఒంటేరు రామ్మూర్తి, పావుశెట్టి సుకన్య ,లక్ష్మీపురం మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈర్ల చిన్ని, మాజీ పీఏసీ చైర్మన్ పూజారి సాంబయ్య, కాంగ్రేస్ సేవాదల్ సభ్యుడు బొచ్చు చెందర్, చిన్నాల గోనాథ్, పరకాల పట్టణ కమిటీ ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రవణ్, సుర సతీష్ ,ప్రధాన కార్యదర్శిలు చందుపట్ల రాజిరెడ్డి ,పబ్బా శ్రీనివాస్ , బొమ్మగంటి చంద్రమౌళి, బొచ్చు బాబు, లక్కం వసంత, పసుల జయ, చర్లపల్లి మాజీ సర్పంచ్ చాడ రవీందర్ రెడ్డి, సమన్వయ కమిటీ సభ్యులు, నడికూడా మండల కమిటీ సభ్యులు, పరకాల మండల కమిటీ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Most Popular