ePaper
Saturday, July 25, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండడ్రగ్స్‌కు దూరంగా ఉండి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం

డ్రగ్స్‌కు దూరంగా ఉండి.. ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకుందాం

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హన్మకొండ;

తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) హనుమకొండ యూనిట్ ఆధ్వర్యంలో గురువారం “Break Free from Drugs – Build a Bright Future”, “Say No to Drugs” నినాదాలతో హనుమకొండ కలెక్టరేట్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు 2కే రన్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, హనుమకొండ అదనపు కలెక్టర్ రవి, వరంగల్ డీసీపీ ధారా కవిత, తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. అనంతరం అధికారులు, విద్యార్థులు, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలతో కలిసి “సే నో టు డ్రగ్స్” ప్రతిజ్ఞ చేయించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, సమాజ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య డి పి ఆర్ ఓ అయుబ్ అలీ కుడా మాజీ చైర్మెన్ సుందర్ రాజ్ యాదవ్ తో పాటు జర్నలిస్ట్ యూనియన్ బాధ్యులు ,పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, అధికారులు పాల్గొని డ్రగ్స్ వ్యతిరేక నినాదాలతో ప్రజల్లో అవగాహన కల్పించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!