ePaper
Monday, September 21, 2026
ePaper
Homeతెలంగాణహన్మకొండహ‌న్మ‌కొండలో ఓబీసీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

హ‌న్మ‌కొండలో ఓబీసీ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

📰 Generate e-Paper Clip

ఆయుధం న్యూస్ హనుమకొండ
తెలంగాణ ఉద్యమ నాయకుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని హనుమకొండ రాంనగర్ లోని బీసీ భవన్ లో ఓబీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారుబీసీ నేతలు, వివిధ కులసంఘాల ప్రతినిధులతో కలిసి ఓబీసీ చైర్మన్, కుడా మాజీ చైర్మన్ ఎస్. సుందర్ రాజ్ యాదవ్ , ఓబీసీ ప్రధాన కార్యదర్శి, ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..బడుగు, బలహీన వర్గాలు, చేనేత కార్మికుల సంక్షేమం కోసం బాపూజీ చేసిన కృషిని ఓబిసి చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ గుర్తుచేశారు.ప్రజా ప్రయోజనాల కోసం పదవులను సైతం త్యాగం చేసిన ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, స్వాతంత్య్ర‌ సమరయోధుడని, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని అన్నారు. ఓబీసీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ గడ్డం భాస్కర్ మాట్లాడుతూ.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చూపిన నిబద్ధత, ధైర్యం, త్యాగం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన పోరాటం మలిదశ ఉద్యమంలో తన నివాసాన్ని తెలంగాణ ఉద్యమం కోసం కేటాయించారన్నారు.కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు..ఆయన సేవలను భావితరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామమన్నారు…ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనగాని యాదగిరి గౌడ్, బీసీ నాయకులు సంగం వేణుమాధవ్ గౌడ్, గాజుల సంపత్, చక్రపాణి, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!