ఆయుధం న్యూస్ జనగామ
నల్ల నర్సింహులు ఆశయాలకు ఘన నివాళులర్పిస్తూ, ఆయన 33వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం మీడియా ఇన్‌చార్జి, సీనియర్ జర్నలిస్టు చింతకింది కృష్ణమూర్తి పిలుపునిచ్చారు.సోమవారం ఆయన మాట్లాడుతూ, నవంబర్ 5న హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించనున్న 33వ వర్ధంతి సభకు పద్మశాలీలు, చేనేత కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ ఉద్యమాలకు పురుడు పోసిన జనగామ జిల్లా కడవెండి గ్రామానికి చెందిన పద్మశాలి ముద్దుబిడ్డ, కామ్రేడ్ నల్ల నర్సింహులు సాగించిన పోరాటం తరతరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజ మార్పు కోసం ఆయన చేసిన త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.నల్ల నర్సింహులు ఆశయాల సాధనకు ఐక్యతతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ప్రతి పద్మశాలీ ఈ సభను తన సొంత కార్యక్రమంగా భావించి పాల్గొనాలని కృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు.
నల్ల నర్సింహులు 33వ వర్ధంతి సభకు పద్మశాలీలు తరలిరావాలి
RELATED ARTICLES
