Saturday, November 30, 2024

E-Paper

Homeతెలంగాణతెలంగాణలో నేడు కాంగ్రెస్ తెచ్చిన కరువు మాజీ మంత్రి కేటీఆర్

తెలంగాణలో నేడు కాంగ్రెస్ తెచ్చిన కరువు మాజీ మంత్రి కేటీఆర్

రైతుల ఎండిపోయిన పంటలను బిఆర్ఎస్ నాయకులు పరిశీలుస్తు రైతులకు భరోస నింపే ప్రయత్నం చేస్తున్నారు. నాడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు పారించి తెలంగాణను సస్యశ్యామలం చేస్తే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కాలం తెచ్చిన కరువు కాదని కాంగ్రెస్ తెచ్చిన కరువని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఆయన గురువారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలోని పరశురాం అనే కౌలు రైతు వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించారు నీళ్లు లేక ఎండిపోతున్న వరిపంటను ఆయన పరిశీలించి ఇది పశుగ్రాశానికి మాత్రమే పనిచేస్తుందని రైతుల పంటలు ఎండిపోతున్నాయని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రైతులకు రెండు లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తామని ఎకరాకు 15 వేల రూపాయలు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ నేటికి ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు కౌలు రైతులకు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామన్నావు వెంటనే ఇయ్యాలని ఆయన డిమాండ్ చేశారు వాగుల్లో చెరువుల్లో మీరు నింపకపోవడంతో అకాల నష్టం రైతులకు నేడు జరిగిందని ఆ పంటల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు

Most Popular