Saturday, November 9, 2024

E-Paper

Homeక్రైమ్సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ

సైలెన్సర్లు మార్పు చేస్తే క్రిమినల్ చర్యలు ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ

ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను ఎలాంటి మార్పు చేసిన వాహనదారుడితో పాటు మార్పు చేసిన మెకానికిపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసిపి సత్యనారాయణ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల కంపెనీ సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై ట్రాఫిక్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇందులో భాగంగా గత అధిక శబ్ధం వచ్చే సైలెన్సర్లు ఏర్పాటు చేసిన 25పైగా ద్విచక్రవాహనాలను గుర్తించి వాటి నుండి మార్పు చేసిన సైలెన్సర్లను ట్రాఫిక్ పోలీసులు తొలగించడంతో పాటు వాహనదారులకు భారీ మొత్తం లో జరిమానాలు విధించారు.అనంతరం ట్రాఫిక్ ఎసిపి మాట్లాడుతూ సిపి అదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను మార్పు చేయడం చట్టరిత్యా నేరమని, శబ్ద కాలుష్య నియంత్రణతో పాటు ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకోని అధికంగా శబ్దం చేసే ద్విచక్రవాహనలపై ప్రత్యేక దృష్టి సారించి తనీఖీలు చేపట్టడం. జరిగింది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు తెలియజేయునది కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే. వినియోగించుకోవాలి, ఎవరైన వాహనదారుడు సైలెన్సర్ మార్పు చేసే వారిపై పోలీసులు తీసులు క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని.. అలాగే తమ మెకానిక్లులు కూడా ఎట్టి పరిస్థితిలో ద్విచక్రవాహనాలకు సైలెన్సర్ల మార్పుకు ప్రోత్సహించవద్దని, ఇకపైన సైలెన్సర్ల మార్పుకు సహకరించిన మెకానిక్లపై క్రిమినల్ చర్యలు తీసుకోబడుతాయని. ఏసిపి తెలియజేసారు. ఈ కార్యక్రమములో హనుమకొండ, వరంగల్, కాజీపేట ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్లు షుకూర్ పాషా, శ్రీధర్ నాగబాబు, ట్రాఫిక్ ఎస్.ఐలు యుగేందర్, ఉమాకాంత్, సూర్యనారాయణ ఆర్ఎస్ఐలు పూర్ణచందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, భాను ప్రకాష్, నాగరాజు, రమేష్, మనోజ్ మరియు వేణు పాటు ఇతర ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

 

Most Popular