Friday, November 8, 2024

E-Paper

Homeక్రైమ్ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానం నేరవేర్చిన పోలీస్‌ కమిషనర్‌

ఆటో డ్రైవర్లకు ఇచ్చిన వాగ్దానం నేరవేర్చిన పోలీస్‌ కమిషనర్‌

ఆయుధం హన్మకొండ
గ్రేటర్ వరంగల్ వరంగల్,హన్మకొండ,కాజీపేట ట్రైసిటి పరిధిలోని ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్‌ పోలీసులు అధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం ఎర్పాటు చేసిన అవగాహన సదస్సులో లైనెన్స్‌ లేని ఆటో డ్రైవర్లకు లైసెన్స్‌ ఇప్పించాల్సిందిగా ఆటో డ్రైవర్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా దృష్టికి తీసుకరావడంతో డ్రైవింగ్‌ లైసెన్సు లేకుండా సూదీర్ఘ కాలంగా ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్లకు లైసెస్సులు అందించడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ ఆటో డ్రైవర్లకు హామీ ఇవ్వడం జరిగింది. మాట తప్పను.. .మడిమ తిప్పను అన్నరీతిలో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కాజీపేట ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చాలా కాలంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేని 35మంది ఆటో డ్రైవర్లకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిశోర్ చేతుల మీదుగా కమిషనరేట్‌ కార్యాలయములో శుక్రవారం లర్నింగ్‌ లైసెన్స్‌లను అందజేసారు.ఈ లైసెన్స్‌ల పంపిణీకి సంబంధించి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు, ఆటో డ్రైవర్లను సమన్వయం చేసుకుంటూ, లైసెన్స్‌కు కావల్సిన దస్త్రాలను సమకూర్చి ఆటో డ్రైవర్లకు లైసెన్సులు మంజూరు చేయడంలో కృషి చేసిన ట్రాఫిక్‌ ఏసిపి సత్యనారయణ, కాజీపేట ట్రాఫిక్‌ ఇన్స్‌స్పెక్టర్‌ నాగబాబు, ఎస్‌.ఐ ఉమాకాంత్‌తో పాటు సిబ్బందిని పోలీస్‌ కమిషనర్‌ ముందుగా అభినందించారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ మాట్లాతుడూ కేవలం ఛలాన్లతో వాహనదారులను ఇబ్బంది పెట్టడం ట్రాఫిక్‌ పోలీసులు అభిమతం కాదని, వాహనదారులతో పాటు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికులు, ఆటో డ్రైవర్లను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడం ట్రాఫిక్‌ పోలీసులు ప్రధాన లక్ష్యమని, రానున్న రోజుల్లో వరంగల్‌, హనుమకొండ పరిధిలోని లైనెన్స్‌ లేని ఆటో డ్రైవర్లకు సైతం లైనెస్స్‌లు అందజేయడం జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ ఆటో డ్రైవర్లకు తెలిపారు.

Most Popular