Friday, November 29, 2024

E-Paper

Homeక్రైమ్డ్యూటి మీట్‌ పోటీల ద్వారా వృత్తిలో నైపుణ్యం సాధించవచ్చు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌...

డ్యూటి మీట్‌ పోటీల ద్వారా వృత్తిలో నైపుణ్యం సాధించవచ్చు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా

ఆయుధం హన్మకొండ
పోలీసులు డ్యూటీ మీట్‌ పోటీల్లో పాల్గోనడం ద్వారా పోలీస్‌ అధికారులు తమ వృత్తిలో మరింత రాణించగలరని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఇటీవల రెండురోజల పాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయములో నిర్వహించిన జోనల్‌ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో విజయం సాధించిన పోలీస్‌ అధికారులకు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా మంగళవారం పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోపతకాలను బహుకరించారు.భద్రాద్రి జోనల్‌ పరిధిలోని వరంగల్‌ కమిషనరేట్‌, ఖమ్మం,కమిషనరేట్‌, భద్రాద్రి కొత్తగూడెం,మహబూబాబాద్‌ జిల్లాలకు చెందిన పోలీస్‌ అధికారులు పాల్గోన్న ఈ జోనల్‌ స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌ ఈ నెల మూడవ తేది నుండి మూడు రోజుల పాటు వరంగల్‌ కమిషనరేట్‌పరేడ్‌మైదానంలో నిర్వహించబడ్డాయి.అధికారులు రోజువారి నిర్వహించే విధులుకు సంబంధించి18 విభాగాల్లో పోటీలను నిర్వహించి విజేతలుగా నిలిచిన మొదటి ముగ్గురికి పోలీస్‌ కమిషనర్‌ చేతుల మీదుగా పతకాలనుఅందజేసారు. ఈ పోటీల్లోరాణించినఅధికారులునుహైదరాబాద్‌లో ఈ నెలలో జరిగే తోలి తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ డ్యూటీ మీట్‌కు పోటీలో పాల్గోన్నాంటారు.ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ. వృత్తిలో నైపుణ్యం సాధించడం ద్వారా నేరస్థులను గుర్తించడం సులభం కావడంతో పాటు నిందితులకు శిక్షలు పడుతాయని, ఆలగే బాధితులను న్యాయం చేసినవారమవుతామని పోలీస్‌ కమిషనర్‌ తెలియజేసారు.ఈ కార్యక్రమములో అదనపు డిసిపిలు రవి,సంజీవ్‌,సురేష్‌ కుమార్‌, ఎసిపిలుఅనంతయ్య,సురేంద్రతో పాటు ఇన్స్‌స్పెక్టర్లు,ఆర్‌.ఐలు ఎస్‌.ఐలు,ఆర్‌.ఎస్‌.ఐలు ఇతర పోలీస్‌ సిబ్బంది పాల్గోన్నారు.

Most Popular