Friday, November 29, 2024

E-Paper

Homeక్రైమ్తివ్రవాదం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా...

తివ్రవాదం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు

మావోయాస్టులు హింస మార్గంలో ఏం సాధించలేమని తివ్రవాదం వీడి జన జీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హింస మార్గాన్ని వీడే మావోయిస్టుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి రావాలని మావోయిస్టులకు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అమిత్ షా సూచించారు. సోమవారం న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం శాఖ మంత్రులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ భవిష్యత్తులో వామపక్ష తీవ్రవాదం దేశానికి పెద్దముప్పుగా పరిణమిస్తుందని కేంద్రంలోని మోదీ సర్కార్ భావిస్తుందని అన్నారు. నక్సల్ వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేసేందుక చర్యలు చేపట్టిందని ఆ క్రమంలో దశాబ్దాల క్రితం నేపాల్‌ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు కారిడార్ ఏర్పాటు చేసేందుకు మావోయిస్టులు ప్రయాత్నాలు చేశారని దీనిని సైతం మోదీ సర్కార్ నక్సల్ ప్రయత్న విఫలం చేశారని తెలిపారు.ఈ సమావేశంలో దేశంలో నక్సలిజం అంతం, అర్బన్ నక్సల్స్ అంశాలపై చర్చించారు. సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హజరైనారు. సీఎంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ వి.శివధర్ రెడ్డి,ఎస్ ఐ బీ ఐజీ బి‌‌‌.సుమతి. పాల్గొన్నారు.

Most Popular