Friday, November 29, 2024

E-Paper

Homeక్రైమ్సెల్ ఫోన్ పోయిందా...సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ లో నమోదు చేయండి -వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్...

సెల్ ఫోన్ పోయిందా…సి.ఈ.ఐ.ఆర్ పోర్టల్ లో నమోదు చేయండి -వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

ఆయుధం హన్మకొండ
ఎవరైన తమ సెల్ ఫోన్‌ పోగొట్టుకున్న, చోరీ జరిగిన బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నూతనంగా వినియోగంలోకి వచ్చిన సి.ఈ.ఐ.ఆర్ వెబ్సైట్ ద్వారా గుర్తించి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లను వాటి యజమానులకు వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం అందజేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోగొట్టుకున్న 142 సెల్ ఫోన్లను గుర్తించి తిరిగి వాటి యజమానులకు పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ టెలికాం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ప్రవేశపెట్టిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సి.ఈ.ఐ.ఆర్) వెబ్సైట్ ఎంతగానో ఉపయోగకరంగా ఉందని, ఎవరైతే మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారో వారు మొదట అదే నంబర్తో నూతన సిమ్ తీసుకోని, మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలి. తదుపరి www.ceir.gov.in వెబ్ సైట్ల వివరాలను నమోదు చేయాలన్నారు.

Most Popular